FbTelugu

నేను చెప్పిన పంట వేయాల్సిందే: కేసీఆర్

తెలంగాణ పత్తికి డిమాండ్ ఉంది

ఇష్టమున్నట్లు చేస్తే రైతు బంద్ కట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అన్ని రకాల పంటలకు అనుకూలం అని సీఎం కేసీఆర్ తెలిపారు. పర్యావరణ అనుకూల వాతావరణం మన ప్రాంత సొంతం అని ఆయన అన్నారు.

రైతులు కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కోరారు. ఈ సారి కాళేశ్వరం నీళ్ళు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి 1.3 లక్షల ఎకరాల్లో పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక నుంచి 70 లక్షల ఎకరాల్లో పత్తి పండించాలి, 40 లక్షల ఎకరాల్లో వరి పండించాలని సూచించారు.

భారత దేశంలోనే అత్యుత్తమ పత్తి తెలంగాణ నుండి వస్తోందని ఆయన తెలిపారు. స్వామినాథన్ సూచన మేరకు కాటన్ లో నాణ్యతను మరింత పెంచితే ఇంకా నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేయొచ్చన్నారు. మహారాష్ట్రలోని విదర్భ కూడా మనతో పాటు అత్యుత్తమ పత్తిని పండిస్తోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వరిపంటను మాత్రమే రైతులు పండించాలి కాదని వేరే వేస్తే రైతుబందు కట్ చేస్తామన్నారు. తెలంగాణ సొనా అనే వరి వెరైటీకి చాలా డిమాండ్ ఉందని, కనీసం పది లక్షల ఎకరాల్లో ఈసారి సొనా వరి పంటను పండించాలి. ప్రతీ జిల్లాకు అగ్రికల్చర్ కార్డు ఉంటుందని, ఆ మేరకే పంటలు పండించాలన్నారు. రైతు సోదరులు అందరూ ప్రభుత్వ సూచనలు పాటించాలన్నారు. రైతుల కోసం మరో 40 లక్షల టన్నుల గోదాములు నిర్మించబోతున్నామన్నారు.

వానా కాలంలో మొక్కజొన్న, వరి వల్ల తక్కువ లాభం ఉంటుందన్నారు. ఏ రకం వరి పంట వేయాలో ప్రభుత్వం చెబుతోందని, ఆ రకాల వరి మాత్రమే పండించాలని కోరారు. వర్షాకాలంలో మక్కలు పండించవద్దని, గిట్టుబాటు ధర రాదని స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో మక్కల వినియోగం 25 లక్షల టన్నులు మాత్రమేనన్నారు. యాసంగిలో మక్క పంటకు ఓకే కాని వర్షంకాలంలో ఎట్టి పరిస్థితుల్లో మక్క పంట వేయవద్దన్నారు. కంది పంట వేసుకోవచ్చని, 2 లక్షల ఎకరాల్లో కూరగాయలు పండించుకోవచ్చని తెలిపారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కేసముద్రంలో 1.25 లక్షల ఎకరాల్లో పసుపు పండిస్తారు.  ఉమ్మడి వరంగల్ మొదలు కొన్ని ఇతర ప్రాంతాల్లో మిర్చి పంట పండించుకొవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోయా పండించుకోవచ్చు.

తెలంగాణలో రైతు రాజ్యం నడుస్తోందని, రాబోయే రెండు మూడు రోజుల్లో రైతులతో ముఖాముఖి ఉండబోతోందన్నారు. తెలంగాణ పంటలు అన్నీ కూడా హాట్ కేకుల్లా అమ్ముడు కావాలనేదే మా లక్ష్యమన్నారు. రైతాంగ సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు కూడా రాష్ట్రం సస్యశ్యామలం కావడానికి రైతును రాజు చేసిందన్నారు. అన్ని రంగాల్లోని రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నదన్నారు. అందుకే తెలంగాణ వ్యవసాయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అందుకే ప్రపంచ ప్రఖ్యాత ఇక్రిశాట్ మన దగ్గర నెలకొల్పారు. వరదలు, తుఫానులు లాంటి ప్రకృతి వైపరీత్యాలు చాలా అరుదు… వృత్తి నైపుణ్యం ఉన్న రైతాంగం మన సొంతమన్నారు. హిమాయత్ పసంద్ లాంటి తెలంగాణ బ్రాండ్ మామిడి మన సొంతమని సీఎం గుర్తు చేశారు.

ఈసారి రికార్డు స్థాయిలో వరితో పాటు ఇతర పంటలు వస్తున్నాయన్నారు. చరిత్రలోనే అత్యధికంగా ఎఫ్ సీఐ కి వరి దిగుమతులు అందించిన ఘనత తెలంగాణ సొంతం కాబోతుందన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రైతాంగం వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.