FbTelugu

రాజ్యాంగ వ్యవస్థను బలహీనం చేశారు: ఉత్తమ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థను పూర్తిగా బలహీనం చేశారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ తలపెట్టిన జలదీక్షను చేపట్టగా కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిర్భందం చేసిన సందర్భంగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఎన్నడూ ఊహించలేదని అన్నారు. ప్రతి పక్షాన్ని ఇంతలా అణచివేయడం ఏంటని ప్రశ్నించారు. కొంతమంది పోలీసులు ప్రజల గొంతునొక్కుతున్నారని అన్నారు. మంత్రుల కార్యక్రమాల్లో అనేక ఉల్లంఘనలు జరుగుతున్నాయని అన్నారు. ప్రాజెక్టులకపై ప్రజలకు వాస్తవాలను చెప్పడమే జలదీక్ష లక్ష్యమని తెలిపారు.

You might also like