FbTelugu

కాళ్లు పట్టుకున్నా కనికరించని కమిషనర్

చెన్నైలో మున్సిపల్ కమిషనర్ దురుసు ప్రవర్తన
లాక్ డౌన్ లో కూరగాయలు, పండ్లు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులపై ఓ మున్సిపల్ కమిషనర్ దురుసుగా ప్రవర్తించిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే..

వానియంబాడి మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న సెల్లిథామస్ రోడ్డు పక్కన పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపారులపై ఒక్కసారిగా విరుచుకు పడ్డాడు. వాళ్లు కాళ్లు పట్టుకొని బతిమలాడినా కనికరించలేదు. కూరగాయలను చెత్తకుప్పలో పడవేశాడు. ఈ తతంగాన్ని కొందరు ఫోన్ లో చిత్రీకరించడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కమిషనర్ తీరుపై అంతర్గత విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.