FbTelugu

మాస్క్ లేదని సిఐ కి జరిమానా

గుంటూరు: కరోనా మహమ్మారి సమయంలో అందరూ మాస్కులు ధరించాలని చెబుతున్న పోలీసులే మాస్క్ ధరించకపోవడంతో జిల్లా ఎస్పీ ఫైన్ వేసిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

గుంటూరు అర్బన్‌ పరిధిలో మాస్కు ధరించని వారిపై జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. లాడ్జి కూడలి, ఎంటీబీ కూడలిలో స్పెషల్‌ డ్రైవ్‌లో ఆయన పాల్గొన్నారు. తుళ్లూరు ట్రాఫిక్‌ సీఐ మల్లికార్జున రావు మాస్కు ధరించకుండా లాడ్జీ కూడలిలో వెళ్లడం ఎస్పీ గుర్తించారు. వెంటనే సీఐ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. మాస్క్ ధరించాలని తెలిసి కూడా మీరు ఎందుకు మాస్క్ ధరించలేదని మండిపడ్డారు. హడావిడిలో మర్చిపోయాను సార్ అని చెప్పాడు. మల్లికార్జునరావుకు విధించాలని అక్కడున్న పోలీసులను అమ్మిరెడ్డి  ఆదేశించి, మాస్క్ తెప్పించి స్వయంగా తొడిగి పంపించారు.

అలాగే వాహనదారులను ఆపి, మాస్క్ ధరించకుండా రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. మాస్కులు ధరించిన వారినే లోనికి అనుమతించాలంటూ సమీపంలోని దుకాణదారులకు సూచించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎస్పీ సూచించారు. 

You might also like

Leave A Reply

Your email address will not be published.