ఢిల్లీ: పలు రాష్ట్రాలలో చిక్కకుకున్న వలస కూలీలను ఎవరి రాష్ట్రాలకు వాళ్ళను పంపేందుకు కేంద్ర హోం శాఖ అనుమతించింది.
తాజా నిర్ణయంతో వేర్వేరు రాష్ట్రాల్లో చిక్కుకున్న విద్యార్ధులు, వలస కూలీలకి ఊరట లభించనున్నది. రెండు రాష్ట్రాల అనుమతితో స్వస్థలాలకు పంపించనున్నారు. కానీ అందరికి వైద్య పరీక్షలు చేసాకే అనుమతించే అవకాశం ఉంది. సొంత రాష్టం చేరుకున్న వారిని కచ్చితంగా హోమ్ క్వారంటైన్ లో ఉంచాలని కేంద్రం ఆదేశించింది. ఆయా ర్రాష్టాలు చర్చించుకుని నిర్ణయం తీసుకోవచ్చని సూచించింది.