FbTelugu

వివేకా కేసులో సిబిఐ ఆదినుంచీ నిర్లక్ష్యం

అమరావతి: మాజీ ఎంపి వైఎస్.వివేకానంద రెడ్డి హత్య ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఏజెన్సీ తొలినుంచి కొంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందా అంటే అవుననే విధంగా విచారణ తీరు ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వివేకానంద హత్య నాటి విషయాలపై ఎబి.వెంకటేశ్వరరావు ఏపీ ఇంటెలి జెన్స్ చీఫ్ గా ఉన్న సమయంలో సిబిఐ కి ఆధారాలతో  లేఖ రాశారు. సిబిఐ విచారణ మొదలై ఏడాది గడిచినా కేసు దర్యాప్తులో పురోగతి లేదని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హత్యకేసు సమాచారం ఉందని సీబీఐకి రెండుసార్లు తెలిపినా కనీసం స్పందించలేదు. దర్యాప్తు అధికారి ఎన్.కె. సింగ్ కు వెంకటేశ్వర రావు ఫోన్ చేసినా స్పందించలేదు. దారుణ హత్యను గుండెపోటు, ప్రమాదంగా చిత్రీకరించేందుకు కొందరు ఎంపి లు యత్నం చేశారని తెలిపారు. హత్య తర్వాత ఇల్లంతా కడిగేసి శవాన్ని ఆస్పత్రికి తరలించేదాకా వైసిపి ఎంపి వైఎస్.అవినాష్ రెడ్డి, ఆయన బంధువులు ఘటనా స్థలాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నారు. ఆ సమయంలో మీడియా ను, ఇంటలిజెన్స్ సిబ్బందిని అనుమతించలేదన్నారు. ఈ మొత్తం సమాచారాన్ని అప్పటి దర్యాప్తు బృందానికి ఏపి నిఘా విభాగం అందజేసినట్లు తెలిసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.