FbTelugu

ఆగిన లారీని డీకొట్టిన కారు

సూర్యాపేట: మునగాల మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరగ్గా అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.

విజయవాడ-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆగివున్న లారీని వెనుక నుంచి కారు అతివేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స కోసం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.