FbTelugu

బైక్ ను ఢీకొన్న కారు.. ఇద్దరు దుర్మరణం

కడప: బైకును కారు ఢీకొట్టిన ఘటనలో ఓ యువతి, యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జిల్లాలోని జమ్మలమడుగు రింగ్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. ఓ బైకును వేగంగా వచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యువతి, మరో యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారైనాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.