FbTelugu

కారు జోరు పెరుగుతోంది: కవిత

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ చివరిదశకు వచ్చే కొద్ది కారు జోరు పెరుగుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గ్రేటర్ ఓట్ల లెక్కింపు తాజా పరిణామాలపై ఆమె స్పందించారు. బీజేపీ ఊపు తగ్గిపోయిందని కారుదే జోరని అన్నారు. మేయర్ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

బ్యాలెట్ల లెక్కింపు కావడంతో కచ్చితమైన సంఖ్య కోసం మరో మూడ్నాలుగు గంటలు పట్టే అవకాశం ఉందని తెలిపారు. కాగా ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులు పలు చోట్ల సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ లో ఎంఐఎం 20 డివిజన్లలో, టీఆర్ఎస్ 19 డివిజన్లలో, బీజేపీ 8 డివిజన్లలో, కాంగ్రెస్ 2 డివిజన్లలో గెలుపొందినట్టుగా తెలుస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.