FbTelugu

బస్సు బోల్తా.. ఓ వ్యక్తి మృతి

పశ్చిమగోదావరి: బస్సు బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జిల్లాలోని పెరవలి మండలం ఖండవల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళుతున్న కావేరి ట్రావెల్స్ కి చెందిన ఓ బస్సు.. ఖండవల్లి రహదారి నాలుగు రోడ్ల కూడలి వద్ద ఒక్కసారిగా బస్సుకు టీవీస్50 మోటారు వాహనం అడ్డంగా రావడంతో ఢీకొని బోల్తా కొట్టింది. టీవీఎస్ నడుపుతున్న కేత సత్యనారాయణ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రావెల్ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలు కాగా మిగిలిన 33మందికి స్వల్పగాయాలైనాయి. క్షతగాత్రుల్లో కొంత మందిని తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించగా ఇంకొంతమంది ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. దీనిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like