FbTelugu

మంత్రాల నెపంతో యువకుని సజీవదహనం

జగిత్యాల: మంత్రాల నెపంతో ఓ యువకున్నీ సొంత కుటుంబ సభ్యులే సజీవదహనం చేసిన దారుణ ఘటన జిల్లాలోని మల్యాల మండలం, బల్వంతాపూర్ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్, జగన్ లు అన్నాదమ్ములు. కాగా ఇటీవల విజయ్ మంజునాథ ఆలయాన్ని, ఓ కుటీరాన్ని నిర్మించాడు.

ఇదిలా ఉండగా.. జగన్ రెండు వారాల క్రితమే అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు. మృతుని కుటుంబాన్ని పరామర్శించేందుకు అతని బావ రాచర్ల పవన్ కుమార్, భార్య కృష్ణవేణి వచ్చారు. వారు మంజునాథ ఆలయం దగ్గర ఉండడంతో అతడే తన భర్త మృతికి కారణమంటూ.. చేతబడి చేసి చంపేశాడంటూ అతన్ని గదిలో బందించి సజీవదహనం చేశారు. పవన్ కుమార్ భార్య అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.