FbTelugu

పెళ్లైన నెలరోజులకే నవవధువు ఆత్మహత్య

హైదరాబాద్ : పెళ్లైన నెలరోజులకే ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అంబర్‌పేటలోని బాపునగర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అత్తమామలు, భర్త వేధింపులు భరించలేక మొబీన్ బేగం అనే మహిళ పుట్టింటికి వచ్చి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మొబీన్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More