FbTelugu

లారీని ఢీకొన్న పెళ్లిబృందం వ్యాన్

ప్రకాశం: పెళ్లిబృందం వ్యాన్ మరో లారీని ఢీకొని ఇద్దరు మృతి చెంది, మరో 8 మందికి తీవ్ర గాయాలైన ఘటన జిల్లాలోని ఒంగోలులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తిరుపతి నుంచి తెనాలికి వెళ్తున్న పెళ్లిబృందం వ్యాన్ ఒంగోలులో ప్రమాదవశాత్తూ ఓ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 8మందికి తీవ్రగాయాలైనాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.