FbTelugu

బర్త్ డే పార్టీకి వెళ్లిన బాలుడు స్విమ్మింగ్ పూల్ లో మృతి

విశాఖపట్నం: బర్త్ డే పార్టీకి వెళ్లిన ఓ బాలుడు అనుమానాస్పదంగా స్విమ్మింగ్ పూల్ లో మృతి చెందిన ఘటన జిల్లాలోని అచ్యుతాపురం మండలం కొండకర్లలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. సాయి అనే బాలుడు తన స్నేహితుడు సుధాకర్ బర్త్ డే పార్టీకి స్థానిక కొండకర్లలోని ఓ ప్రైవేట్ రిసార్ట్ కు వెళ్లాడు. కాగా ఆ బాలుడు అనుమానాస్పద స్థితిలో స్విమ్మింగ్ పూల్ లో విగతజీవునిగా ప్రత్యక్షమైనాడు. బాలుని స్నేహితులే హత్య చేసిఉంటారంటూ.. బాలుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.