FbTelugu

వైద్యం అందక కడుపులోనే బిడ్డ మృతి

నల్లగొండ: ప్రసవానికి వచ్చిన ఓ గర్భిణికి వైద్యం అందక కడుపులోనే బిడ్డ మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. గత రాత్రి ఓ గర్భిణీ పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది.

అయితే ఆ సమయంలో ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో గర్భిణికి వైద్యం అందలేదు. దీంతో ప్రసవానికి ముందే కడుపులోనే బిడ్డ మృతి చెందింది. వైద్యులు అందుబాటులో లేకపోవడం పట్ల బాలింత బంధువులు ఆందోళనకు దిగారు.

You might also like