FbTelugu

ప్రభుత్వ వైఖరి సరిగా లేదు: కన్నా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలస కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కన్నా మరోసారి లేఖ రాశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో లేఖ రాసినప్పటికీ ప్రయోజనం లేదన్నారు. రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీలను ఆదుకొని, వారిని తమ తమ స్వస్థలాలకు పంపించాలని కోరినట్టు తెలిపారు.

You might also like