FbTelugu

ఖ‌గోళ అద్భుతం ఆవిష్కృతం

హైదరాబాద్: ఆకాశంలో ఇవాళ సూర్యగ్రహణం ఆవిష్కృతం అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఆదివారం ఉదయం 9.15 గంటలకు సూర్య గ్రహణం మొదలైంది.

సూర్యుడికి జాబిల్లి అడ్డురావడంతో గగనతలంలో సుందర దృశ్యం ఆవిష్కృతం అయి ప్రజలను కనువిందు చేసింది. మనదేశంలో మధ్యాహ్నం 3.04 గంటల వరకు గ్రహణం కొనసాగుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకటించారు. పలువురు విద్యార్థులు, శాస్త్రవేత్తలు టెలిస్కోప్, ప్రత్యేక కళ్లద్దాల ద్వారా గ్రహణం వీక్షించారు.

గ్రహణం కార‌ణంగా దేశంలోని ప్ర‌ముఖ దేవాలయాలను మూసివేశారు. గ్ర‌హ‌ణం విడుపు అనంత‌రం సాయంత్రం సంప్రోక్షణ నిర్వహించి భక్తులను అనుమతిస్తారు.

You might also like