FbTelugu

క్షమాభిక్షపొందిన 125 మంది భారత్‌ రాక

ఢిల్లీ: బహ్రెయిన్ లో క్షమాభిక్ష పొందిన 125 కార్మికులు భారత్ చేరుకున్నారు. వీరంతా ఆదివారం రాత్రి కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు.

బహ్రెయిన్ దేశంలో కేరళకు చెందిన 125 కార్మికులు వివిధ నేరాలకు పాల్పడి బహ్రెయిన్‌లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవలే అక్కడి ప్రభుత్వం 125 మంది కేరళ కార్మికులకు క్షమాభిక్ష పెట్టి విడుదల చేసింది. విడుదలైన వారందరూ ప్రత్యేక విమానంలో కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు.

నిబంధనల ప్రకారం క్వారంటైన్ కు పంపించాల్సి ఉండడంతో వారందరినీ నావికాదళ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అయితే అదే విమానంలో కేరళలో ఉన్న బహ్రెయిన్‌కు చెందిన 60 మందిని తిరిగి పంపించినట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 14 రోజులపాటు మిలటరీ వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు.

క్వారంటైన్ ముగిసిన తర్వాత వారిని వారి సొంత ప్రాంతాలకు పంపిస్తామన్నారు. దుబాయ్, అబుధాబిలలో చిక్కుకున్న 347 మంది భారతీయులు ఆదివారం రెండు విమానాల్లో ఎర్నాకుళం చేరుకున్నారు. వీరిని కూడా అధికారులు క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

You might also like