FbTelugu

మొదటికొచ్చిన టిటిడి ప్రధాన అర్చకుల నియామకం

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)లో ప్రధాన అర్చకుల నియామకం మొదటికొచ్చింది. ప్రధాన అర్చకుల నియామకంపై ఒకరి కేసులో హైకోర్టులో తీర్పు రిజర్వ్ లో ఉండగా, మరొకరి విషయంలో స్టే ఉంది.

పదవీ విరమణ పొందిన ప్రధాన అర్చకులు ఎవి.రమణ దీక్షితులు, ఎవి.నరసింహ దీక్షితులను తిరిగి నియమిస్తూ ఏప్రిల్ 2న టీటీడీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గొల్లపల్లి, తిరుపతమ్మ కుటుంబాల నుంచి ప్రధాన అర్చకులుగా వేణుగోపాల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు అప్పటికే కొనసాగుతున్నారు. మీ ఇద్దరిని ఆ పదవి నుంచి ఎందుకు తొలగించకూడదంటూ టిటిడి నోటీసులు జారీ చేసింది. టిటిడి నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు. వాదనల తరువాత వేణుగోపాల దీక్షితుల కేసులో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గోవిందరాజ దీక్షితుల కేసులో హైకోర్టు స్టే మంజూరు చేసింది. హైకోర్టు స్టే, తీర్పు రిజర్వ్ తో రమణ దీక్షితుల, నరసింహ దీక్షితుల నియామకం మళ్లీ మొదటికి వచ్చిందని అంటున్నారు. ఈ కేసు ఎన్ని మలుపులు తీరుగుతుందోనంటూ అర్చకులు చర్చించుకుంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.