FbTelugu

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

అమరావతి : ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోమారు హైకోర్టులో చుక్కెదురైంది. ఫిబ్రవరిలో ఏపీ స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఎస్ఈసీ (స్టేట్ ఎలక్షన్ కమిషన్) ఇప్పటికే ప్రకటించింది.

అయితే కరోనా నేపథ్యంలో ఫిబ్రవరిలో ఏపీ స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును ఇవాళ విచారించిన హైకోర్టు ఏపీ ప్రభుత్వ విజ్ణప్తిని తోసిపుచ్చింది. ఎన్నికల నిర్వహణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అలాగే ఈ కేసును రేపటికి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.