FbTelugu

‘పంచాయతి’పై నేడు కోర్టుకెళ్లనున్న ఏపీ సర్కార్

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై ఇవాళ హైకోర్టుకు జగన్ సర్కార్ ఆశ్రయించనుంది.

పంచాయతీ ఎన్నిక నిర్వహణకు తాము సిద్ధంగా లేమని కోర్టుకు ప్రభుత్వం తెలుపనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై జగన్ ప్రభుత్వం ఇవాళ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనుంది. స్థానిక ఎన్నికలపై ఇప్పటికే అనేక మార్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం వ్యతిరేకించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.