FbTelugu

ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీంలో చుక్కెదురు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని ఏపీ ఎన్నికల సంఘం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ సందర్భంగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను, రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్‌తో జత చేసింది.

You might also like