FbTelugu

ప్రేమపెళ్లి జంటను బలిగొన్న రోడ్డు ప్రమాదం

* పెళ్లి చేసుకున్న గంటల వ్యవధిలోనే మృతి

కామారెడ్డి : పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఎన్నో ఆశలతో ప్రేమ వివాహం చేసుకున్న ఓ నవ ప్రేమపెళ్లి జంటను.. రోడ్డు ప్రమాదం కబళించివేసింది. పెళ్లి చేసుకొని గంటలు కూడా గడవక ముందే మృత్యువాత పడ్డారు. ఈ ఘటన జిల్లాలోని సదాశివనగర్‌ మండలం, మోడెగామ వద్ద చోటుచేసుకొని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకెళితే.. మోడె గ్రామానికి చెందిన సతీష్(24), హైదరాబాద్ కు చెందిన మహిమ(22) గత కొంతకాలంగా ప్రేమించుకొని గురువారం ప్రేమవివాహం చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోరేమోనన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా.. గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిమ అక్కడికక్కడే మృతి చెందగా.. సతీష్ తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. నిన్న మృతి చెందాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.