FbTelugu

4వ విడత లాక్ డౌన్ కు వేళాయే !

న్యూఢిల్లీ: భారత్ లో నేటితో మూడవ విడత లాక్ డౌన్ ముగియనుంది. రేపటినుంచి నాల్గవ విడత లాక్ డౌన్ విధివిధానాలను ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గని నేపథ్యంలో

తదుపరి 4.0 (నాల్గవ విడత) లాక్ డౌన్ ఉంటుందని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ లో పలు రంగాలకు సడలింపులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై ప్రజల్లో సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.