FbTelugu

ఇందుకేనా రిటైర్మెంట్ ప్రకటించాడు!

ముంబై: మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ కు గల కారణాలపై క్రికెట్ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ-20 వరల్డ్ కప్ వరకు పరిమిత ఓవర్ల క్రికెట్ లో కొనసాగాలని భావించారు.

వరల్డ్ కప్ లో విజయం సాధించిన తరువాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయించాడు. అయితే అతని అంచనాలు తారుమారు కావడంతో టీ-20 సిరీస్ లో తలపడే అవకాశం లేకపోవడం కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు. సెప్టెంబర్ 19న ఐపీఎల్-13 సీజన్ ఆరంభం కానుండడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు టైటిల్ సాధించి పెట్టాలని ధోని ఉబలాటపడుతున్నాడు.

You might also like