FbTelugu

చైనా వైరస్ కాదు కుంగ్ ఫ్లూ: ట్రంప్

వాషింగ్టన్: కరోనా వైరస్ కు ఎన్ని ప్రత్యామ్నాయ పేర్లు పెట్టినా చైనా అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో తాజాగా దానికి కుంగ్ ఫ్లూ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామకరణం చేశారు.

కరోనా వైరస్ చైనా దేశం సృష్టించిందని, ఆ దేశం నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందిందని ట్రంప్ కోడై కూస్తున్న విషయం తెలిసిందే. అమెరికాలోని ఒక్లామా సెంటర్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.

ఇప్పటి వరకు కరోనా వైరస్ కు 19 పేర్లు పెట్టగా, చైనా నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని ఆయన చెప్పారు. చైనా దేశం అని ప్రపంచానికి తెలిసేలా, ఆ దేశం అభ్యంతరం లేవనెత్తకుండా కొత్త పేరు కనుగొన్నట్లు ప్రకటించారు. ఇక నుంచి కుంగ్ ఫ్లూ అని పిలుస్తానని ట్రంప్ వెల్లడించారు. ప్రపంచంలో అందరూ కరోనా వైరస్ అని పిలిస్తే, తను మాత్రం కుంగ్ ప్లూ అని పిలుస్తానని ట్రంప్ స్పష్టం చేశారు.

కుంగ్ ఫూ చైనా మార్షల్ ఆర్ట్స్ లో ఒకటైన విషయం అందరికీ తెలిసిందే. దీంతో చైనాకు చిక్కకుండా, బదనాం కాకుండా ట్రంప్ ఈ పేరు పెట్టినట్లుగా ఉంది.

You might also like