FbTelugu

ఆ విషయంలో మొదట్లో చాలా భయపడేదాన్ని

తెలుగు, తమిళ సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది పూజా హెగ్డే. ఆమె పలు ఆసక్తికర విషయాలను తన అభిమానులతో పంచుకున్నారు. తనకు మొదట్లో సినిమాలు తీస్తున్నప్పుడు అవి రిలీజ్ కు ముందు రోజు ఎంతో భయపడేదాన్నంటూ చెప్పుకొచ్చారు. సినిమా ఎలా ఉంటుందో.. ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారోనని రాత్రిల్లు నిద్ర కూడా పోయేది కాదట.

అయితే రాను రాను ఆ భయం పూర్తిగా తగ్గింపోయిందని తెలిపారు. ముంబైలో పుట్టి పెరిగిన పూజా హెగ్డే.. మోడల్ గా, సినీ నటిగా తన కెరీర్ ను ప్రారంభించారు. ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.. మూడు పదుల వయసులోనూ కుర్రకారును ఓ ఊపు ఊపేస్తున్నారనడంతో ఆశ్చర్యం లేదు.

You might also like