అమరావతి: దేశంలో ఆయా రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో చిక్కుకు పోయిన వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యత రాష్ట్రాలదేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు పయనమైన వలస కూలీ మృతి చెందడం చాలా బాధాకరం అన్నారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళానికి భయలు దేరిన వలస కూలీ ఇవాళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. వలస కూలీల చావులను ఆపాలని అన్నారు.