FbTelugu

ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు: జగదీశ్ రెడ్డి

హైదరాబాద్: భవిష్యత్తులో తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాదంటూ రాష్ట్ర మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.

తెలంగాణ ప్రజల ఉసురుతోనే కాంగ్రెస్ పార్టీ నాశనమైంద‌న్నారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండటం కాంగ్రెస్‌ నేతలకు నచ్చడం లేదన్నారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ 300లకు పైగా కేసులు వేసిందని విమర్శించారు. ఆరేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. తమ పార్టీపై, నేతలపై కాంగ్రెస్ నేత‌లు నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఇక‌నైనా ఇటువంటి చ‌ర్య‌లను మానుకోవాల‌న్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.