FbTelugu

ఆ మంత్రి దోచుకున్న సొమ్ము రాబట్టాలి: బుద్దా

అమరావతి: ఈఎస్ఐ స్కామ్ వెనుక అసలు పాత్రధారులు బయటపడ్డారని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా పలు విమర్శలు చేశారు.

‘‘ఈఎస్ఐ స్కామ్ వెనుక అసలు పాత్రదారుడు వైకాపా మంత్రి జయరామ్.మంత్రి జయరామ్ ఈఎస్ఐ స్కామ్ లో ఏ14 నిందితుడు కార్తీక్ ని తన సొంత కొడుకుగా భావించి అన్ని పనులు చేసిపెట్టాలని శాఖ అధికారులను ఎందుకు ఆదేశించారు ?

శాఖ లో అవినీతి కి సహకరించని అధికారి ఉదయలక్ష్మి గారిని శాఖ నుండి తొలగించడానికి ఎందుకు ప్రయత్నించారు ? కార్తీక్ కి బెయిల్ ఇప్పించమని మంత్రి జయరామ్ సజ్జల గారితో కలిసి చేసిన పంచాయతీ ఏంటి ? వెంటనే సమగ్ర దర్యాప్తు చేసి మంత్రి జయరామ్ దోచుకున్న కష్టజీవుల సొమ్ము వెనక్కి రాబట్టాలి.’’ అంటూ.. తీవ్రంగా విమర్శలు కురిపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.