FbTelugu

అందుకే పరీక్షలు నిలిపివేశాం: తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 16 వ తేదీ నుంచి ఇప్పటి వరకు 36 వేల నమూనాలను సేకరించామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇంకా 8253 నమూనాల రిపోర్టు అందాల్సి ఉండడంతో, అప్పటి వరకు కొత్త నమూనాల సేకరణ నిలిపివేశామని పేర్కొంది. ప్రజల నుంచి నమూనాలు సేకరించాక, 48 గంటల లోపు ల్యాబ్ లలో పరీక్షలు చేయాల్సి ఉంటుందన్నారు. 8253 నమూనాల రిపోర్టులు వచ్చిన తరువాత మళ్లీ సేకరణ ప్రారంభిస్తామని తెలిపింది.

రోజులు మూడు నుంచి నాలుగు వేల వరకు గ్రేటర్ లో నమూనాలు సేకరించడం మొదలు పెట్టిన తరువాత కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. అంతకు ముందు వంద వరకే రాగా ఇప్పుడు ఐదు వందలకు పైగా వస్తున్నాయి. దీంతో ప్రజల్లో భయం నెలకొనడంతో పాటు ప్రభుత్వంలో పునరాలోచనలో పడింది. ఇలాగే పరీక్షలు కొనసాగిస్తే డొల్లతనం బయటపడుతుందనే ఉద్దేశంతోనే నిలిపివేసినట్లు విమర్శలు మొదలయ్యాయి.

You might also like