FbTelugu

ఆ జీవో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకం: గుత్తా

హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 203 తెలంగాణ ప్రయోజనాలకు పూర్తిగా వ్యతిరేకమని గుత్తా సెఖేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని అన్నారు.

పోతిరెడ్డిపాడును మొదటి నుంచి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. పోతిరెడ్డిపాడు సమార్థ్యం పెంపును సీఎం కేసీఆర్ ఒప్పుకోరని తెలిపారు. ఎపీ సీఎం జగన్ 88 వేల క్యూసెక్కుల నీటిని తరలించాలని భావించడం అత్యశేనన్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కు ఒకే విధానం ఉండాలని అన్నారు.

You might also like