FbTelugu

ఆ విషయం పార్టీ విధానానికి విరుద్ధం: సోము వీర్రాజు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయం కేంద్రం పరిధిలో లేదని బీజేపీ ఏపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుజనా చౌదరికి కౌంటర్ ఇచ్చారు.

రాజధాని విషయం కేంద్రం పరిధిలోనే ఉందనడం పార్టీ విధానానికి విరుద్ధమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే కొనసాగాలని అన్నారు. రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నదే బీజేపీ విధానమని తెలిపారు.

You might also like