FbTelugu

ఆ జీవో భావ ప్రకటనా స్వేచ్ఛకు ఆటంకం: శేఖర్ గుప్త

That-GO-obstructs-freedom-of-expression

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన జీవోపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. మీడియా సంస్థలపై పరువునష్టం దావా వేసే అధికారం శాఖాధిపతులకు కల్పిస్తూ ఆధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను ఎడిటర్స్ గిల్డ్ తీవ్రంగా తప్పుబట్టింది. ఐఏఎస్ అధికారులకు ఇటువంటి అధికారాలు కట్టబెట్టడం వల్ల దుర్వినియోగానికి గురయ్యే అవకాశముందని ఆంధోళన వ్యక్తంచేసింది. అది మీడియా భావ ప్రకటనా స్వేచ్చకు తీవ్ర హాని కారిగా అభివర్ణించింది. గతంలో సమాచార కమిషనర్ చేతిలో వున్న ఈ అధికారం శాఖల సెక్రెటరీలకు కట్టబెట్టడంవల్ల మీడియా సంస్థల పనితీరును చిన్న బుచ్చేదిగా వుందని అభిప్రాయపడింది. అభ్యంతరకమైన ఈ అధికారాలు వ్యక్తుల చేతుల్లో వుంటే అది మరో రూపంలో మీడీయా నియంత్రణకు దారితీసే ప్రమాధముందని పేర్కొంది. వెంటనే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని ఎడిటర్స్ గిల్ట్ అధ్యక్షులు సీనియర్ పాత్రికేయులు శేఖర్ గుప్త డిమాండ్ చేశారు.

You might also like