FbTelugu

సున్నితమైన మార్గంలో ప్రపంచాన్ని కదిలించవచ్చు: రాహుల్

న్యూఢిల్లీ: సున్నితమైన మార్గంలో ప్రపంచాన్ని కదిలించవచ్చునని కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ అన్నారు. గణతంత్ర దినోత్సవం రోజు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ, ఎర్రకోట ముట్టడి హింసాత్మకంగా మారిన తరుణంలో ఆయన మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

గణతంత్ర దినోత్సవం రోజు నిర్వహించిన రైతు ఆందోళనలలో మూడు వందలకు పైగా పోలీసులు గాయపడగా.. ఓ రైతు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని మరోమారు మోదీ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నానని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.