FbTelugu

ఆ మృగాన్ని అరెస్టు చేయాలి: వాసిరెడ్డి పద్మ

అమరావతి: తన ఇద్దరు భార్యలు సుమతి, జయమ్మలపై భర్త కళ్యాణం వెంకన్న చేసిన పాశవిక దాడి, హత్యాయత్నం అమానుష చర్య అని ఏపి మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు.

తూర్పుగోదావరి ఏజన్సీ చింతూరు మండలం చట్టి లో జరిగిన ఈ ఘటనపై వాసిరెడ్డి పద్మ వెంటనే స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పి నయిం హస్మి తో ఫోన్ లో మాట్లాడారు. ఈ ఘటన పై సత్వతమే చర్యలు తీసుకుని ఇద్దరి భార్యలకు రక్షణ కల్పించాలని, మృగంలా ప్రవర్తించిన భర్త కళ్యాణం వెంకన్నను తక్షణమే అరెస్టు చేయాలని ఆమె ఆదేశించారు. ఇద్దరు భార్యలపై మృగంలా ప్రవర్తించి, కటింగ్ ప్లేర్, కత్తి పట్టుకుని అత్యంత క్రూరంగా హింసించడమే కాకుండా సెల్ఫీ వీడియో తీయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఈ నెల 3న ఘటన జరిగినా బాధిత మహిళలు ముందుకొచ్చి 15 రోజులకు ధైర్యం చేసి చింతూరు పోలీసులకు ఫిర్యాదు చేయడం అభినందనీయమని వాసిరెడ్డి పద్మ అన్నారు.

ఒక భార్య పై పెట్రోలు పోసి, వేడివేడి నీళ్ళలో చేతులు ముంచి చిత్రహింసలకు గురి చేశాడని, మరో భార్య చేతులు, కాళ్లు కట్టేసి అత్యంత దారుణంగా కాళ్ళతో తొక్కిపెట్టి కటింగ్ ప్లేర్,కత్తితో చెవి, ముక్కు కత్తిరించడం అమనవీయమన్నారు. మృగంలా అఘాయిత్యానికి పాల్పడ్డ భర్త కల్యాణం వెంకన్న నుంచి ఆ మహిళలు తప్పించుకుని పుట్టింటికి పారిపోకపోతే వారి ప్రాణాలతో దక్కేవికావని అన్నారు. ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు, యువతులు ధైర్యంగా ముందుకువచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని వాసిరెడ్డి పద్మ కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.