FbTelugu

ఆ 60 కేజీల బంగారం టీటీడీ అకౌంటులోకే!

* కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ పాలకమండలి

తిరుపతి : టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) పాలక మండలి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 2008 లో రూ.100 కోట్ల అంచనాతో ‘ఆనంద నిలయం అనంత స్వర్ణమయం’ నిర్మాణానికి టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం ఆ ప్రాజెక్టును టీటీడీ పూర్తిగా నిలిపివేయాలని తీర్మానం చేసింది.

గతంలో ఈ ప్రాజెక్టు కోసం దాతలు రూ.13 కోట్ల నగదు, 95 కేజీల బంగారాన్ని విరాళంగా అందజేశారు. అయితే 2011 లో ఈ ప్రాజెక్టును కోర్టు తీర్పు మేరకు నిలిపివేశారు. కాగా దాతలు ఇచ్చిన విరాళాల్లో 27 కేజీల బంగారం, రూ.7.25 కోట్లను దాతలు ఇతర ప్రాజెక్టులకు మళ్లించగా.. ప్రస్తుతం 60 కేజీల బంగారం, రూ.4.61 కోట్ల నగదు ప్రాజెక్ట్ అకౌంట్‌లోనే ఉన్నాయి. విరాళం ఇచ్చిన దాతలు తమ విరాళాలను వెనక్కి తీసుకోకపోతే.. వాటిని టీటీడీ అకౌంట్‌లో జమచేయాలని నిర్ణయించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.