FbTelugu

తాండవ్ వెబ్ సిరీస్… ఆమెకు చిప్పకూడు తప్పదా?

న్యూఢిల్లీ: అమెజాన్ ఇండియా ప్రధాన ప్రతినిధి అపర్ణ పురోహిత్ కు జైలు జీవితం తప్పేట్టు లేదు. తాండవ్ వెబ్ సిరీస్ మీద నమోదైన కేసులో ఆమె ముందస్తుగా చేసుకున్న బెయిల్ పిటీషన్ ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది.

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అమెజాన్ ప్రైమ్ లో పొలిటికల్ డ్రామా తాండవ్ వెబ్ సిరీస్ ప్రసారం అయిన విషయం తెలిసిందే. బీజేపీ తో పాటు హిందూ సంస్థలు కొన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. మెజారిటీ హిందూ ప్రజల మనోభావాలను కించపరుస్తూ తీసిన దర్శక, నిర్మాతలు, ప్రసారం చేసిన అమెజాన్ ప్రైమ్ పై చర్యలు తీసుకోవాలంటూ ఉత్తరప్రదేశ్ లోని నోయిడా కేసు నమోదు అయింది.

ఈ కేసులో అమెజాన్ ఇండియా ప్రధాన ప్రతినిధి అపర్ణ పురోహిత్ ముందస్తు బెయిల్ పిటీషన్ ను అలహాబాద్ హైకోర్టులో దాఖలు చేశారు. విచారణ సందర్భంగా జస్టిస్ సిద్ధార్థ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిటీషన్ దారుడికి ఈ దేశ చట్టాలపై చిన్నచూపు ఉన్నట్లు ఆమె ప్రవర్తన ద్వారా తెలుస్తోందన్నారు. ఈ వైఖరి కారణంగా ఆమెకు కోర్టు నుంచి లాంటి ఉపశమనం దక్కదు అని స్పష్టం చేశారు. భారతీయ పౌరులు అసహనంగా ఉన్నారు. ఈ దేశంలో నివసించడానికి సరక్షితం కాదంటూ విదేశాల్లో ప్రచారం చేస్తూ చర్చను లేవనెత్తుతాయని, దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

పాశ్చాత్య దేశాలలో చిత్ర నిర్మాతలు తమ దైవమైన ఏసుప్రభువును, ఇతర మత ప్రవక్తలను ఎగతాళి చేయరు. కాని హింది చిత్ర నిర్మాతలు మాత్రం హిందూ దేవతలను చాలా ఘోరంగా అవమానిస్తున్నారు. వారికి హద్దులనేవి లేవని జస్టిస్ సిద్ధార్థ కఠినంగా వ్యాఖ్యానించారు. వీటిని అడ్డుకోకపోతే భారతీయ సమాజం వినాశకరమైన పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.