చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఒక్కరోజే 1,982 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయి చరిత్ర సృష్టించింది.
గత పది రోజులుగా తమిళనాడులో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఇవాళ నమోదు అయిన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 40,698 కి చేరుకున్నది. ఇప్పటి వరకు 367 మంది చనిపోగా, 22,047 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు 1,342 మంది పేషెంట్లు డిశ్చార్జీ అయి రికార్డు నెలకొల్పారు.
తమిళనాడు మొత్తం 40,698 కేసులు ఉండగా ఒక్క చెన్నై మహానగరంలోనే 28,924 కేసులు నమోదు అయ్యాయి. ఇవ్వాళ నమోదు అయిన 1,982 కేసులలో 1,477 కేసులు చెన్నై నగరంలోనే నమోదు కావడం తీవ్రతను స్పష్టం చేస్తున్నది.