FbTelugu

కేసీఆర్ లేకపోతే నష్టమేంటి?: తలసాని

హైద్రాబాద్: సీఎం కేసీఆర్ కన్పించకపోతే ప్రతిపక్షాలకు వచ్చే నష్టమేంటి?. సీఎం కన్పించకపోతే పాలన ఆగిందా? ప్రభుత్వ పథకాలు ఆగాయా? అని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతిపక్షాలను నిలదీశారు.
తెలంగాణ ప్రతిపక్షాలు పనికిరాని చెత్త దద్ధమ్మలు అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పరిపాలనలో సచివాలయం ఒక భాగం.. కొత్త సచివాలయం కడితే తప్పేంటి? అని అన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా జి.కిషన్ రెడ్డి తెలంగాణపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడున్నారని ఆయన విమర్శించారు.

బీజేపీ నాయకులకు చేతనైతే.. ప్రధానితో మాట్లాడి దేశంలో హెల్త్ ఎమర్జీని పెట్టించాలని సూచించారు. కరోనా ప్రారంభంలో చప్పట్లు, దీపాలు ఎందుకు వెలిగించాలని మేము ప్రశ్నించామా? అని తలసాని ప్రశ్నించారు. ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రభుత్వానికి నియంత్రణ లేదనటం సరైంది కాదన్నారు.
ఢిల్లీలో కరోనాను ఎందుకు కట్టడి చేయలేకపోయారో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం తో కలిస్తే.. కరోనా వచ్చేస్తోందా? కేంద్రమంత్రి దీనికి సమాధానం చెప్పాలని తలసాని శ్రీను అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మంచి సదుపాయాలున్నాయన్నారు

ఫిట్ నెస్ లేనోళ్లకే కరోనా వస్తోంది…

కరోనా వైరస్ వస్తోంది పోతోంది.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారానే కరోనాను ఆపగలమన్నారు. హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు, మాజీ ఎంపీ వీ.హనుమంతరావులే దీనికి ఉదాహరణ అన్నారు. ఫిజికల్ ఫిట్ నెస్ లేని వారు మాత్రమే కరోనా వస్తే ఇబ్బందులు పడ్తున్నారన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో లక్ డౌన్ అమలు చేయడం వల్ల అంతగా ప్రయోజనం ఉండదని తలసాని శ్రీను అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.