FbTelugu

సికింద్రాబాద్‌లో వస్త్రదుకాణాల బంద్

హైదరాబాద్: పరిధిలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వస్త్ర సికింద్రాబాద్ వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

నేటి నుంచి జూలై నెల 5 వరకు దుకాణాలను స్వచ్ఛందంగా మూసి వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సికింద్రాబాద్ చేనేత, సిల్కు, వస్త్ర దుకాణదారుల సంఘం అధ్యక్షుడు టి.అశోక్ కుమార్ ప్రకటించారు.

హైదరాబబాద్ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తికి తాము కారణం కాకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సికింద్రాబాద్‌ జనరల్ బజార్‌లోని నగల వ్యాపారులు కూడా ఇదే నిర్ణయానికి వచ్చారు. తాము కూడా దుకాణాలను మూసివేస్తున్నామని తెలిపారు.

You might also like