FbTelugu

కరోనా నిర్ధారించే టెస్టులు ఇవే…

హైదరాబాద్: కరోనా పరీక్షలు ఎలా చేస్తారు. ఏ పరీక్షకు శాస్త్రీయత ఉంటుందనే దానిపై వివరాలు ఇలా ఉన్నాయి. కోవిడ్ టెస్టుల్లో రకాలపై ప్రతీ ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశాలు ఇలా ఉన్నాయి.

ఆర్టీ పీసీఆర్ టెస్టు: ఈ పరీక్షలో మీ ముక్కు లేదా గొంతులోని స్వాబ్ తీసి పరీక్షిస్తారు. ఫలితం రావడానికి 2-3 రోజులు పడుతుంది. ఈ పరీక్షలో పాజిటివ్ వచ్చినా నెగెటివ్ వచ్చినా 100% స్పష్టం అని అర్థం.

రాపిడ్ – యాంటిజెన్ టెస్టు: ఈ పరీక్షను కూడా స్వాబ్ ద్వారానే నిర్వహిస్తారు. కానీ ఫలితం 15 నిమిషాల్లో తేలిపోతుంది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే 100% పాజిటివ్ అనే అర్ధం. నెగిటివ్ వచ్చి, కోవిడ్ లక్షణాలు తగ్గకపోతే ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాల్సిందే.

యాంటిబాడీ టెస్టు: రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేస్తారు. ఫలితం ఒక రోజు లోపే అందచేస్తారు. అయితే ఈ పరీక్షా ఫలితం సరైంది కాదని అంటున్నారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కోసం యాంటిబాడీ పరీక్షను నమ్ముకోవద్దు.

You might also like