FbTelugu

వైరస్ తగ్గుముఖం పట్టాకే పరీక్షలు: వీహెచ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల పరీక్షలను వాయిదా వేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కోరారు.

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టాకే పరీక్షలు నిర్వహించాలని కోరారు. గోదావరి ప్రాజెక్టుల పరిశీలనకు ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులను అనుమతించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

You might also like