FbTelugu

ఈఎస్ఐ లో అచ్చన్న కు పరీక్షలు

కృష్ణా: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు వాహన కాన్వాయ్ కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది.

కొద్దిసేపటి క్రితం హనుమాన్ జంక్షన్ దాటి విజయవాడ వైపు వెళ్లింది. ఈఎస్ఐ ఆసుపత్రిలో అచ్చెన్నాయుడు కి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తరువాత ఏసీబీ అధికారులు మంగళగిరిలో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నివాసంలో అచ్చెన్నాయుడు ను హాజరు పరచనున్నారు.

సాయంత్ర వరకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కోర్టు హాలులోనే వేచి ఉన్నారు. సమయం మించిపోవడం, ఇంకా రాకపోవడంతో ఆయన ఇంటికి వెళ్లిపోయారు. అచ్చెన్నాయుడిని తీసుకువస్తున్నందున ఈఎస్ఐ ఆసుపత్రి, న్యాయమూర్తి నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మొహరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.