FbTelugu

ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది హతం

జమ్ము కశ్మీర్: భారత భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైన ఘటన జమ్ముకశ్మీర్ లోని సోపోర్ దగ్గర చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. సోపోర్ లో ఉగ్రవాదులున్నారన్న ముందస్తు సమాచారంతో భారత భద్రతా బలగాలు ఆపరేషన్ నిర్వహించాయి.

ఈ ఆపరేషన్ లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్టు సైనికాధికారులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా కశ్మీర్ లో భద్రతా బలగాలు వరుస ఆపరేషన్లతో ఉగ్రవాదులను మట్టుబెడుతున్నాయి.

You might also like