FbTelugu

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూలు: ఎద్దుల బండిని లారీ ఢీకొని ముగ్గురు మృత్యువాత పడిన ఘటన జిల్లాలోని పాములపాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. స్థానిక పాములపాడులో ఓ ఎద్దుల బండిని లారీ బలంగా ఢీకొట్టింది. ఆ లారిని మరో మరో లారీ వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడి కక్కడే మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు పాములపాడు మండలం ఎర్రగూడురు వాసులుగా గుర్తించారు.

You might also like