FbTelugu

మంత్రులకు ఘోర పరాభావం

నెల్లూరు: వైసిపి ఎంపి అభ్యర్థి గురుమూర్తికి ఓటు వేయాలని ప్రచారానికి వెళ్లిన నేతలకు చుక్కెదురు అయ్యింది. సమస్యలు పట్టించుకోవడం లేదంటూ ఘెరావ్ చేశారు.
గూడూరు నియోజకవర్గంలో ఇవాళ మంత్రి సిదిరి అప్పలరాజు, ఎంపి మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే వరప్రసాద్, వైసిపి నాయకులు ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.

తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ అధికార పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించినవారిని మత్స్యకారులు నిలదీశారు. తమిళ మత్స్యకారులతో సమస్య పరిష్కరించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వరప్రసాద్ గో బ్యాక్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేయడంతో చేసేది లేక మంత్రులు, వైసిపి నాయకులు వెనుతిరిగారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.