FbTelugu

ఏజెన్సీలో ఘోర ప్రమాదం…

రాజమండ్రి: చింతూరు లోని శబరి నది బ్రిడ్జిని ఢీకొని లాంచీ‌ మునిగింది. గట్టిగా ఢీకొనడంతో లాంచీ రెండు ముక్కలైనట్లు సమాచారం వస్తోంది. లాంచీలో వరద ముంపు బాధితులు ప్రయాణిస్తున్నారు.

చీకటి కావటంతో ఎంత మంది లాంచీలో ఉన్నారో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ఈ సమాచారం తెలియగానే పోలీసులు హుటాహుటిన బయలుదేరి ఘటనా ప్రాంతానికి చేరుకుంటన్నారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం పది మంది వరకు ఉండవచ్చని అంటున్నారు.

You might also like