ప.గో.జిల్లా: జంగారెడ్డిగూడెం బైపాస్ రోడ్డు లో శ్రీనివాసపురం జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. గుబ్బల మంగమ్మ ఆలయానికి వెళ్తున్న ట్రాక్టర్ ని లారీ ఢీకొన్నది.
ఈ ఘటనలో ట్రాక్టర్ లో ఉన్న 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులు కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామానికి చెందినవారు.
ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను 108 వాహనాలలో ఏరియా హాస్పిటల్ కు తరలించారు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ లో మిగిలిన 9 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. జంగారెడ్డిగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.