FbTelugu

ఏపిలో టెన్త్ పరీక్షలు వాయిదా

హైకోర్టుకు తెలిపిన విద్యాశాఖ
అమరావతి: పదో తరగతి పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ప్రస్తుతానికి విద్యా సంస్థలు తెరిచే ఉద్దేశం లేదని కూడా చెప్పింది. పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది.

పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలపాలని ఏపి ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. వాయిదా వేస్తున్నామని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. అయితే పరీక్షల వాయిదా, స్కూళ్లు తెరవబోమని అఫిడవిట్ వేయాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ఉపాధ్యాయులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ గా గుర్తించలేదంటూ దాఖలైన అఫిడవిట్‌పై విచారణ ముగించాలని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. తదుపరి విచారణను జూన్ 18కి వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.